WGL: జిల్లా నర్సంపేటలో అదనపు జిల్లా కోర్టును ఏర్పాటు చేయాలని బార్ అసోసియేషన్ బాధ్యులు కోరారు. ఈ మేరకు వరంగల్ జిల్లా పోర్టు పోలియో న్యాయమూర్తి మోషమి భట్టాచార్యను నర్సంపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పుట్టపాక రవి ఆధ్వర్యంలో శుక్రవారం కలిశారు. అదనపు జూనియర్ సివిల్ కోర్టులలో రెగ్యులర్ న్యాయమూర్తులు లేకపోవడంతో పెండింగ్ కేసులు పెరుగుతున్నాయన్నారు.