KMR: బాన్సువాడ పట్టణంలోని 13వ వార్డు టీచర్స్ కాలనీలో మాజీ కౌన్సిలర్ బాడీ శ్రీనివాస్ పర్యవేక్షణలో శనివారం పిచ్చి మొక్కలు, గడ్డి నివారణకు మందు పిచికారీ చేయించారు. వర్షాకాలంలో పిచ్చి మొక్కలు పెరగకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కాలనీవాసులకు సూచించారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని శ్రీనివాస్ తెలిపారు.