RR: బాలాపూర్ గణనాథుడికి సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్య కుమార్ తన బృందంతో కలిసి స్వాగతం పలికారు. బాలాపూర్ గణేశ్ శోభాయాత్ర రాచకొండ కమిషనరేట్ పరిధిని దాటి HYD పోలీస్ కమిషనరేట్ పరిధిలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా అధికారులు స్వాగతం పలికారు. భక్తులు డప్పు చప్పుళ్లు, నృత్యాలతో ఉత్సవాల్లో పాల్గొన్నారు. కాగా.. శోభాయాత్ర పాతబస్తీ మీదుగా ట్యాంక్ బండ్‌కు కదులుతోంది.