MNCL: బ్యాంకు సేవలతో ప్రజల సొమ్ముకు భద్రత ఉంటుందని టీజీబీ బ్యాంకు మేనేజర్ వినయ్, జన్నారం మండలంలోని కిస్టాపూర్ గ్రామ సర్పంచ్ వాసాల నరేష్ అన్నారు. బుధవారం కృష్ణాపూర్ గ్రామంలో ప్రజలకు బ్యాంకు సేవలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజల మేలు కోసమే బ్యాంకులు పనిచేస్తున్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ బ్యాంకు సేవలను వినియోగించుకోవాలన్నారు.