నిజామాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రేమించిన యువతి పెళ్లి చేసుకుందామని అతడిని లండన్ నుంచి రప్పించింది. కానీ చివరకు వేరే వ్యక్తిని వివాహం చేసుకోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన సాఫ్ట్వేర్ ఇంజినీర్ శ్రీకాంత్ రెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆరేళ్ల ప్రేమించిన తనను ఆమె మోసం చేసిందని సెల్ఫీ వీడియోలో ఆరోపించాడు.