ఖమ్మం బైపాస్ నూతన బస్టాండ్ వద్ద ప్రభుత్వ నిబంధనలను బేఖాతర్ చేస్తూ కడుతున్న అక్రమ బిల్డింగ్ కట్టడాలపై చర్యలు తీసుకోవాలని కమిషనర్‌కు సీపీఎం నాయకులు ఫిర్యాదు చేశారు. నిబంధనలు పాటించకుండా ఏకంగా బైపాస్ రోడ్ పైకి వచ్చి బిల్డింగ్లు కట్టే పరిస్థితి ఏర్పడిందని జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వై విక్రం తెలిపారు.