PDPL: రామగుండం కార్పొరేషన్ 25వ డివిజన్లో అభివృద్ధి చేయాలని అధికారులను అడిగితే ఏకంగా పోలీసులు తనను అరెస్టు చేసి స్టేషన్లో నిర్బంధించడం ఏంటనీ కార్పొరేటర్ నగునూరి సుమలత ఆరోపించారు. ఈ విషయం శాంతియుతంగా సీఎం దృష్టికి తీసుకువెళ్లాలని ప్రయత్నం చేస్తే పోలీసులు భగ్నం చేశారన్నారు. ఈరోజు ఉదయం తనను పోలీసులు తీసుకువెళ్లి స్టేషన్లో ఉంచడం సరైన విధానం కాదన్నారు.