KMM: జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 18న పర్యటించనున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా ఇంఛార్జ్ కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ అధికారులను ఆదేశించారు. సీఎం పర్యటన ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ సునీల్ దత్, అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి తదితరులతో కలిసి ఆమె పరిశీలించారు. శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.