NZB: ఆర్మూర్ పట్టణంలోని అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు పాడైపోయిన కోడి గుడ్లను చేస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇంఛార్జి సయ్యద్ అవేస్ ఆరోపించారు. దీనిపై వివరణ అడిగితే సిబ్బంది దుర్భాషలాడారని, ఫిర్యాదు చేస్తే ఎవరిని చెప్పుకుంటారో చెప్పుకోండి అని దురుసుగా మాట్లాడారని ఆయన తెలిపారు. సంబధిత అధికారులు స్పందించాలని కోరారు.