WGL: బీజేపీ వరంగల్ జిల్లా కౌన్సిల్ సభ్యుడిగా దువ్వ నవీన్ నియమితులయ్యారు. ఈమేరకు పార్టీ జిల్లా ఎన్నికల అధికారి వేముల నరేంద్ర రావు గురువారం తెలిపారు. వరంగల్ జిల్లాలో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా నవీన్ తెలిపారు. ఈ అవకాశాన్ని వమ్ము చేయకుండా కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ పనిచేస్తానన్నారు.