NZB: ఇందిరమ్మ ఇళ్లు కాంగ్రెస్ పార్టీ నేతలకు మాత్రమే ఇస్తున్నారని అర్బన్ MLA ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులైన వారిని పక్కన పెట్టి కేవలం తమ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇళ్లను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కట్టబెడుతున్నారని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం కాంగ్రెస్ నాయకుల కాళ్లు మొక్కినా కనికరించట్లేదని ట్వీట్ చేశారు.