నిజామాబాద్: ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంక్ ఖాతాదారుల సేవలకు అంతరాయం ఏర్పడుతుందని బిక్కనూర్ గ్రామీణ బ్యాంకు మేనేజర్ వెంకటేశ్వర్లు తెలిపారు. బ్యాంకును జనవరి 1 నుంచి తెలంగాణ గ్రామీణ బ్యాంకులో విలీనం చేయనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ATM, యూపీఐతో పాటు ఇతర సేవలకు ఈనెల 31 వరకు అంతరాయం ఉంటుందన్నారు. ఈ విషయంలో ఖాతాదారులు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని అన్నారు.