RR: కడ్తాల్ మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల జూనియర్ కళాశాలలో గణితం బోధించుటకు గెస్ట్ లెక్చరర్ పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్వో అనిత తెలిపారు. సంబంధిత సబ్జెక్ట్‌లో పీజీ పూర్తి చేసిన మహిళ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 23వ తేదీలోగా స్థానిక కేజీబీవీలో దరఖాస్తులు అందించాలని కోరారు.