ADB: నార్నూర్ మండలంలోని కొత్తపల్లి మల్కుగూడ గ్రామంలో శుక్రవారం ఆవుల కొట్టం పథకానికి అధికారులు శ్రీకారం చుట్టారు. ఈ సందర్బంగా కొట్టం నిర్మాణానికి జెఈ బాపూరావు, పంచాయతీ కార్యదర్శి చౌహన్ నీరజ్ కలిసి భూమిపూజ చేశారు. అనంతరం లబ్దిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచి దిగంబర్, రామేశ్వర్, సెడ్మకి ఆనందరావు, గోపాల్ రావు ఉన్నారు.