MNCL: స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈనెల 18, 19 తేదీలలో హైదరాబాద్లో జరిగిన వాలీబాల్ పోటీలలో మంచిర్యాల కార్మెల్హై స్కూల్ విద్యార్థి సాయి దీక్షిత్ ప్రతిభ చూపాడు. దీంతో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడని ప్రిన్సిపల్ సిస్టర్ సారూప్య బుధవారం తెలిపారు. ఈనెల 23న పూణేలో జరగనున్న జాతీయ స్థాయి పోటీలలో సాయి దీక్షిత్ పాల్గొంటాడని పేర్కొన్నారు.