KMM: అర్హులైన జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రెస్ క్లబ్ అధ్యక్షులు శ్రీనివాస రావు అన్నారు. శుక్రవారం మధిరలో నిర్వహించిన జర్నలిస్టుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మధిరలో ప్రెస్ క్లబ్ కార్యాలయం ఏర్పాటుకు ప్రభుత్వం స్థలం కేటాయించి, నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. జర్నలిస్టులను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.