MNCL: తెలంగాణ రజక రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర మహాసభలు ఈ నెల 29న జనగామలో నిర్వహిస్తున్నట్లు మంచిర్యాల జిల్లా అధ్యక్షులు సంగం లక్ష్మణ్ తెలిపారు. శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో మహాసభ గోడ పోస్టర్లను ఆయన విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్రంలో రజకుల సమస్యలపై చర్చించి భవిష్యత్ పోరాట కార్యాచరణ రూపొందించనున్నట్లు పేర్కొన్నారు.