SRD: శ్రావణమాసం మొదటి శనివారం సందర్భంగా సంగారెడ్డి పట్టణం శ్రీ వైకుంఠాపురంలో సుదర్శన నరసింహ హోమ కార్యక్రమాన్ని నిర్వహించారు. దేవాలయ ప్రధాన అర్చకులు కందాడై వరదాచార్యులు ఆధ్వర్యంలో హోమ కార్యక్రమం జరిగింది. అనంతరం ఆలయ పురవీధుల మీదుగా వెంకటేశ్వర స్వామి పల్లకి సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు జై శ్రీమన్నారాయణ అంటూ పెద్ద ఎత్తున నామస్మరణ చేశారు.