నల్గొండ: డిండి మండలం దేవత్ పల్లి తండాలో భర్తను చంపిన భార్యను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. అక్రమ సంబంధానికి అడ్డువస్తున్నాడని భర్త కుమార్‌ను భార్య లక్ష్మి ఈ నెల 23న ప్రియుడు మధు, ప్రియుడి స్నేహితుడు సాయికిరణ్‌తో కలిసి తమ వ్యవసాయ పొలం వద్ద గొంతు నులిమి చంపి ఉరి వేసిందని, నిందితులను అరెస్టు చేసి శుక్రవారం రిమాండ్‌కు పంపినట్లు పోలీసులు తెలిపారు.