నిజామాబాద్: ఎల్లారెడ్డి మండలం తిమ్మాపూర్లో సీసీ రోడ్డు నిర్మాణానికి ఆదివారం తాజా మాజీ జడ్పీటీసీ ఉషాగౌడ్ ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆదేశాలతో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి అవసరమున్న చోట స్థలాలు పరిశీలించి కొలతలు నిర్వహించారు. తిమ్మాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నర్సింలు, మాజీ సర్పంచ్ రవీందర్, మత్తమాల సొసైటీ వైస్ చైర్మన్ పద్మారావు, కాంగ్రెస్ నేతలు ఉన్నారు.