నిజామాబాద్: బిక్కనూర్ మండలానికి చెందిన 9 మంది లబ్ధిదారులకు మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు భీమ్ రెడ్డి ఉన్నారు.