NRML: మామడ మండలం పోతారం గ్రామంలో శుక్రవారం స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో భాగంగా అవగాహన సదస్సు నిర్వహించారు. సీజనల్ వ్యాధుల నుండి జాగ్రత్త పడాలని ఎంపీడీవో గంగాసాగర్ రెడ్డి సూచించారు. అనంతరం మల్టీ పర్పస్ కార్మికులకు సేఫ్టీ కిట్లను అందజేశారు. పంచాయతీ కార్యదర్శి సుజాత, ఏపీవో శివాజీ, ఏపీఎం అరుణ, సీసీలు డీఆర్డీఏ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.