KMM: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఐఎఫ్డీయు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకులు కొమరం శాంతయ్య అన్నారు. ఈ విషయమై సోమవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం కొమరం శాంతయ్య అధ్యక్షతను జరిగిన సమావేశంలో ఆ సంఘం జిల్లా నాయకులు యాసారపు వెంకన్న, ఏరియా కమిటీ సభ్యులు రమేష్ మాట్లాడారు.