HYD: నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్లో నేడు స్వచ్ఛత హి సేవ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి గల్లీ గల్లీకి తిరుగుతూ అధికారులు, సిబ్బంది ప్రజలకు స్వచ్ఛతపై అవగాహన కల్పించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు, నిల్వ ఉన్న నీటిని ఎప్పటికప్పుడు తొలగించాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో స్థానికులు సువర్ణ, రణప్రియ, కోకిల, తదితరులు పాల్గొన్నారు.