KMM: మధిర మండల పరిధిలోని చిలుకూరు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో గత కొన్ని సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తూ వేరే పాఠశాలకు వెళుతున్న ఉపాధ్యాయులను ఆదివారం స్థానిక గ్రామ ప్రజలు ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో మధిర రూరల్ ఎస్సై లక్ష్మీ భార్గవి పాల్గొని దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పాల్గొన్నారు.