MBNR: జడ్చర్ల నియోజకవర్గంలో తాగునీటి అవసరాలకు ప్రజలు ఇబ్బందులు పడకూడదని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు. బుధవారం జడ్చర్ల పట్టణంలో 47 కోట్ల రూపాయలతో చేపట్టిన అమృత్ పథకానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జడ్చర్ల నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.