BHNG: భువనగిరిలోని ఖిల్లా పూర్తిస్థాయిలో అభివృద్ధి జరిగితే టూరిజం స్పాట్‌గా మారుతుందని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం భువనగిరి ఖిల్లా వద్ద రోప్ వే నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ హనుమంత్ కె జెండగేతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.