WNP: జిల్లాలోని పాఠశాలలలో అమలుచేస్తున్న జీపీఎస్ విధానంలో మార్పులు చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ ఆదర్ష్ సురభికి అఖిలపక్ష ఐక్యవేదిక ఆధ్వర్యంలో అధ్యక్షులు సతీష్ యాదవ్ వినతిపత్రం సమర్పించారు. జీపీఎస్ విధానం ద్వారా మహిళా ఉపాధ్యాయినిల వ్యక్తిగత ఫోటోలు బహిర్గతం అవుతూ ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఇందుకు ప్రత్యామ్నాయంగా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.