ఖమ్మం జిల్లా కోర్టు సముదాయాలలో వైద్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. రాజగోపాల్ సోమవారం ప్రారంభించారు. ఆయన వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కోర్టుకు వచ్చే ప్రతి ఒక్కరూ వైద్య పరీక్షలు చేయించుకోవాలని జడ్జి సూచించారు.