MBNR: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఫార్మసీ విభాగాన్ని మెడికల్ కళాశాల ఫార్మా కాలేజీ వైద్య బృందం సభ్యులు మంగళవారం సందర్శించారు. ఫార్మసీ విభాగంలో స్టాక్ ఎంట్రీ రిజిస్టర్, అక్కడ ఉన్న మందుల ఎక్స్పైరీ తేదీలను పరిశీలించారు. తేదీల ప్రకారం మొదట సప్లై అయిన మందులను ముందుగా రోగులకు అందించాలని సూచించారు.