NLG: జమిలి ఎన్నికల విధానానికి కేంద్రక్యాబినెట్ ఆమోదం తెలపడం సరైనవిధానం కాదని. నల్గొండ జిల్లా సీపీఎం కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని 1,2,3 వార్డులలో జరుగుతున్న సీపీఎం శాఖ మహాసభలో ఆయన మాట్లాడుతూ.. 2029 నుంచి ఒకే దేశం ఒకే ఎన్నికవిధానాన్ని ఎన్డీఏ ప్రభుత్వం కేంద్ర క్యాబినెట్లో ప్రవేశపెట్టడం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం అన్నారు.