కరీంనగర్: రానున్న బతుకమ్మ, దసరా ఉత్సవాలకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆదేశించారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల్లో ఏవైనా సమస్యలు ఉంటే నేటి నుంచే వాటిని పరిష్కరిస్తూ ఏర్పాట్లు పూర్తిచేయాలని పేర్కొన్నారు.