ఖమ్మం: మున్నేరు వరద బాధిత మహిళలకు శనివారం కార్పొరేటర్ నాగేశ్వరరావు చీరలను పంపిణీ చేశారు. సుమారు 3,000 మంది మహిళలకు చీరలను పంపిణీ చేసినట్లు చెప్పారు. వరద బాధితులకు అండగా ఉంటానని తెలిపారు. ప్రభుత్వం ద్వారా వచ్చే ప్రతి ఒక్క సౌకర్యాలను బాధితులకు చేరే విధంగా కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు పాల్గొన్నారు.