కాన్పూర్ వేదికగా భారత్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ తొలి రోజు ఆటకు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో తొలి రోజు ఆట కేవలం 35 ఓవర్లకు మాత్రమే పరిమితం అయింది. ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ 107 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. మోమినుల్ హక్ (40), ముష్ఫికర్ రహీమ్(6) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో ఆకాశ్ దీప్ రెండు, ఆశ్విన్ ఒక వికెట్ తీశారు.