స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్ కోల్పోయిన రోహిత్ సేన ఆట తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సొంతగడ్డపైనే రాణించలేనివాళ్లు ఆసీస్ పిచ్‌లపై ఆడటం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పాక్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ పేసర్లను ఆడడంలో రోహిత్ ఇబ్బంది పడుతున్నాడు. AUSతో సిరీస్‌లో రోహిత్ ఓపెనర్‌గా కాకుండా వన్‌డౌన్‌లో బరిలోకి దిగాలి’ అని సూచించాడు.