యోయో పరీక్షలపై క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. టెస్టుకు బదులు ఓ ఆటగాడు మానసికంగా ఎంత బలంగా ఉన్నాడనేది అంచనా వేయాలన్నారు. అదే ఆటగాడి ఫిట్నెస్కు నిజమైన సూచిక అని పేర్కొన్నారు. ‘మైదానంలో బ్యాటుతో సర్ఫరాజ్ రాబడుతున్న ఫలితాలు అతడి మెజర్మెంట్స్ కన్నా మెరుగ్గా ఉన్నాయి. సన్నటి నడుము రిషబ్ పంత్కు కూడా లేదు. కానీ అతడు మైదానంలో ఎంతో ప్రభావం చూపిస్తాడు’ అని పేర్కొన్నారు.