భారత్, బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ జరుగుతోంది. ఇప్పటికే మొదటి మ్యాచ్ చెన్నైలో జరగగా భారీ విజయం సాధించిన టీమిండియా 1-0తో ముందుంది. అయితే ఇవాళ కాన్పూర్‌లో జరిగే రెండో మ్యాచ్ ఉ.9.30 గం.లకు జరగాల్సి ఉండగా టాస్ ఆలస్యం కానుంది. నిన్న రాత్రి వర్షం కురవడంతో సిబ్బంది గ్రౌండ్‌పై కవర్లతో కప్పి ఉంచింది. అయినా పిచ్ చిత్తడిగా మారింది. దీంతో అంపైర్లు ఉ. 9.30 గం.లకు పిచ్‌ను పరిశీలించనున్నారు.