టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ తన రీ ఎంట్రీలో సత్తాచాటుతున్నాడు. దాదాపు 600 రోజుల తర్వాత టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చి.. తొలి మ్యాచులోనే అద్భుత సెంచరీతో అదరగొట్టాడు. ఈ నేపథ్యంలో పాక్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా పంత్‌పై ప్రశంసలు కురిపించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పునరాగమనం తర్వాత పంత్ మరింత అద్భుతంగా రాణిస్తున్నాడని, భవిష్యత్‌లో టెస్టుల్లో కెప్టెన్‌గా భారత జట్టును నడిపిస్తాడని అన్నాడు.