బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్లో టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రికార్డుల మోత మోగిస్తున్నాడు. తాజాగా కాన్పూర్ వేదికగా బంగ్లాతో జరుగుతున్న రెండో టెస్టులో అశ్విన్ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఆసియాలో అత్యధిక టెస్టు వికెట్లు పడగొట్టిన భారత బౌలర్గా రికార్డులకెక్కాడు. కుంబ్లే 419 వికెట్లు తీయగా.. అశ్విన్ ఇప్పటివరకు 420 వికెట్లు పడగొట్టాడు.