ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియాకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్ గాయపడ్డాడు. వెన్నుకు గాయం కావడంతో ఇంగ్లాండ్తో జరిగే చివరి వన్డేకు అతడు దూరం అయ్యాడు. ఈ నేపథ్యంలో భారత్తో జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫిలో గ్రీన్ ఆడతాడా? లేదా? అని సందిగ్ధత నెలకొంది. కాగా భారత్-ఆస్ట్రేలియా మధ్య నవంబర్ 22న తొలి టెస్టు ప్రారంభం కానుంది.