అహ్మదాబాద్ వేదికగా భారత్, న్యూజిలాండ్ మహిళల జట్ల మధ్య జరిగిన రెండో వన్డేలో భారత్ పరాజయం పాలైంది. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ 76 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ 9 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన టీమిండియా 47.1 ఓవర్లలో 183 పరుగులకు ఆలౌటయ్యింది. ఈ క్రమంలో మూడు వన్డేల సిరీస్లో భాగంగా 1-1తో సమమైంది. దీంతో మూడో వన్డే కీలకం కానుంది.