భారత్ – న్యూజిలాండ్ తొలి టెస్టులో నాలుగో రోజు ఆట ప్రారంభమైంది. గాయం కారణంగా కీపింగ్‌కు దూరంగా ఉన్న రిషభ్ పంత్ బ్యాటింగ్‌కు దిగాడు. అంతకు ముందు నుంచే బ్యాటింగ్ చేస్తున్న సర్ఫరాజ్ ఖాన్ వన్డే తరహాలో ఆటతీరును ప్రదర్శిస్తూ 110 బంతుల్లో సెంచరీ చేశాడు. దీంతో టెస్టుల్లో సర్ఫరాజ్ ఖాన్ మొదటి శతకం సాధించాడు. కాగా.. ప్రస్తుత స్కోర్ 3 వికెట్లు 274 పరుగులుగా ఉంది.