HYD: పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రజా భవన్ పక్కన అతివేగంగా వచ్చిన కారు రోడ్డుపై పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న పలువురు యువకులకు గాయాలయ్యా యి. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.