స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌ను భారత్ కోల్పోయింది. ప్రస్తుతం అందరి దృష్టి ఆస్ట్రేలియా పర్యటనపై ఉంది. ఈ క్రమంలోనే భారత జట్టు విఫలమైతే BCCI జట్టుకు ఫార్మాట్లను బట్టి కోచ్‌లను నియమిస్తుందనే ప్రచారం జోరందుకుంది. దీనిపై మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా స్పందించాడు. ఈ వార్త పుకారేనని ఆయన అనుకంటున్నట్లు తెలిపారు. ఫార్మాట్ల ఆధారంగా కోచ్‌లను నియమిస్తారని చెప్పడం తొందరపాటే అవుతుందని అభిప్రాయపడ్డారు.