చెక్ రిపబ్లిక్ కార్ల తయారీ సంస్థ స్కోడా మరో కాంపాక్ట్ SUVని ‘కైలాక్’ పేరుతో రిలీజ్ చేసింది. ప్రత్యేకంగా భారతీయ వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని కంపెనీ ఈ కారును లాంచ్ చేసింది. దీని ధర రూ.7.89 లక్షలతో ప్రారంభమవుతుంది. ఈ కారు కోసం ఈ సంవత్సరం డిసెంబర్ 2వ తేదీ నుంచి బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభమవుతుందని కంపెనీ తెలిపింది. ఇతర స్కోడా కార్ల కంటే ‘కైలాక్’ కొంత భిన్నంగా ఉండనుందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.