AP: శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 2,22,641 క్యూసెక్కులుగా ఉండగా.. ఔట్ ఫ్లో 2,28,071 క్యూసెక్కులు ఉంది. అయితే పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.80 అడుగులుగా ఉంది. అలానే పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 214.8450 టీఎంసీలుగా ఉంది.