మనిషి ఆరోగ్యంగా ఉండేందుకు శృంగారం ఎంతగానో ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. శృంగారం అనేది ఒక వ్యాయామం లాంటిందని, ఇది రక్త ప్రసరణను మెరుగుపరిచి గుండెపోటు నుంచి రక్షిస్తుందని తెలిపారు. శృంగారం సమయంలో విడుదలయ్యే ఎండార్ఫిన్ అనే హార్మోన్ తలనొప్పిని త్వరగా నయం చేస్తుందని అన్నారు. అంతేకాకుండా నిద్రలేమి, ఆర్థరైటిస్ వంటి వ్యాధులకు కూడా శృంగారం ద్వారా చెక్ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు.