వెల్లుల్లిలో రుచి, వాసననే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి యూరిక్ యాసిడ్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. నిత్యం ఒకటి లేదా రెండు వెల్లుల్లి రెబ్బలు పచ్చిగా తినాలి. ఇలా చేస్తే శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి మందులతో అవసరం లేకుండా తగ్గుతుంది. వెల్లుల్లిని పచ్చిగానే కాకుండా కూరలు, సూప్‌లు, సలాడ్లలో కూడా జోడించవచ్చు.