లైట్ మోటర్ వెహికిల్(LMV) డ్రైవింగ్ లైసెన్స్‌దారులకు సుప్రీంకోర్టు గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ లైసెన్స్ కలిగిన వారు కూడా 7,500 కిలోల కంటే తక్కువ బరువున్న ట్రాన్స్‌పోర్టు వాహనాన్ని నడపడానికి అర్హులేనని తీర్పు చెప్పింది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. సుప్రీంకోర్టు నిర్ణయంతో కమర్షియల్ వెహికల్స్ డ్రైవర్లకు ఊరట లభించినట్లయింది.