TG: సీఎం రేవంత్ రెడ్డి పంతాలు, పట్టింపులకు పోకుండా జీవో 29ని రద్దు చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కోరారు. సోమవారం నుంచి పరీక్షలు అని తెలిసి కూడా ఆందోళనలు చేస్తున్నారంటే అర్థం చేసుకోండి అని సీఎంకు బహిరంగ లేఖ రాశారు. నిరుద్యోగులంతా మీ కుటుంబ సభ్యులుగా భావించి వారి ఆవేదన అర్థం చేసుకోవాలని అన్నారు. వెంటనే గ్రూప్1 పరీక్ష రీషెడ్యూల్ చేయండి అని వెల్లడించారు.